సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వాడె వేంకటాద్రిమీద
పల్లవి:

ప|| వాడె వేంకటాద్రిమీద వరదైవము | పోడమితో బొడచూపె బొడవైన దైవము ||

చరణం:

చ|| వొక్కొక్కరోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు | పిక్కటిల్ల వెలుగొందే పెనుదైవము |
పక్కనను తనలోని పదునాలుగులోకాలు | తొక్కి పాదానగొలచేదొడ్డదైవము ||

చరణం:

చ|| వేదశాస్త్రాలు నుతించి వేసరి కానగలేని- | మోదపుపెక్కుగుణాలమూలదైవము |
పోది దేవతలనెల్ల బుట్టించ రక్షించ | ఆదికారణంబైన అజునిగన్నదైవము ||

చరణం:

చ|| సరుస శంఖచక్రాలు సరిబట్టి యసురల | తరగ పడవేసినదండిదయివమా |
సిరి వురమున నించి శ్రీవేంకటేశుడయి | శరణాగతులగాచేసతమయినదయివము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం