సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వాడె వేంకటేశుడనేవాడె
పల్లవి:

ప|| వాడె వేంకటేశుడనేవాడె వీడు | వాడిచుట్టుగైదువవలచేతివాడు ||

చరణం:

చ|| కారిమారసుతుని చక్కనిమాటలకు జొక్కి | చీరగా వేదాలగుట్టు చూపినవాడు |
తీరని వేడుకతో తిరుమంగయాళువారి- | ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాడు ||

చరణం:

చ|| పెరియాళువారిబిడ్డ పిసికి పైవేసిన | విరులదండల మెడవేసినవాడు |
తరుణి చేయివేసిన దగ్గరి బుజముచాచి | పరవశమై చొక్కి పాయలేనివాడు ||

చరణం:

చ|| పామరుల దనమీది పాటలెల్లా బాడుమంటా | భూమికెల్లా నోర నూరిపోసినవాడు |
మామకూతురల మేలుమంగనాచారియు దాను | గీముగానే వేంకటగిరి నుండేవాడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం