సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వాడెవో ప్రహ్లాదవరదుడు
పల్లవి:

వాడెవో ప్రహ్లాదవరదుడు
వాడెవో భక్తవత్సలుడు ||

చరణం:

కోరదవడలతో కోటిసూర్యతేజముతో |
హారకేయూర భూషణాంబరాలతో |
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను |
మేరమీరిన సిరుల మేడతో నున్నాడు ||

చరణం:

తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ |
చల్లని గందముల వాసనలతోడ |
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా |
వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు ||

చరణం:

సంకుచక్రములతోడ జంట పూదండలతోడ |
పొంకపు నానావిధ భోగములతో |
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు |
అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం