సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వాదులేల చదువులు
పల్లవి:

వాదులేల చదువులు వారు చెప్పినవేకావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా!!

చరణం:

నాలుగువేదాలబ్రహ్మ నలి నెవ్వనిసుతుడు
వాలినపురాణాలవ్యాసుడెవ్వని దాసుడు
లీల రామాయణపువాల్మీకివసిష్టులు
ఆలకిం చెవ్వని గొల్చి రాతడే పోదేవుడు !!వాదు!!

చరణం:

భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన
ధీరుదైన శుకుడు యేదేవుని కింకరుడు
సారపుశాస్త్రాలు చూచిసన్యసించి నుడిగేటి
నారాయణనామపునాధుడేపో దేవుడు !!వాదు!!

చరణం:

విష్ణువాగ్యయని చెప్పేవిది సంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
"విష్ణుమయం సర్వ" నునేవేవేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుడే ఆదేవుడు !!వాదు!!

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం