సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వాసివంతు విడిచినవాడే
పల్లవి:

ప|| వాసివంతు విడిచినవాడే యోగి యీ- | ఆసలెల్లా విడిచిన ఆతడే యోగి ||

చరణం:

చ|| గద్దించి పారెడు తురగమువంటి మనసు | వద్దని మరలించినవాడే యోగి |
వొద్దనే కొండలవంటివున్న దేహగుణాలు | దిద్ది మట్టుపెట్టువాడే ధీరుడైన యోగి ||

చరణం:

చ|| ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన | వంచన మునుగునట్టివాడే యోగి |
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు | దంచి పారజల్లువాడే తత్త్వమెరిగిన యోగి ||

చరణం:

చ|| వెగటుకామాదుల వెళ్ళగొట్టి శాంతుడై | వగలుడిగినయట్టివాడే యోగి |
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుడై భక్తి | దగిలి నిలుపువాడే ధన్యుడైన యోగి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం