సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వైష్ణవులుగానివార
టైటిల్: వైష్ణవులుగానివార
పల్లవి:
ప|| వైష్ణవులుగానివార లెవ్వరు లేరు | విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన ||
చరణం:చ|| అంతయు విష్ణుమయంబట మరి దేవ- | తాంతరములు గలవనేలా |
భ్రాంతి బొంది యీభావము భావించి- | నంతనే పుణ్యులౌట దప్పదుగాన ||
చ|| యెవ్వరి గొలిచిన నేమిగొరత మరి | యెవ్వరి దలచిన నేమి |
ఆవ్వలివ్వల శ్రీహరిరూపు గానివా- | రెవ్వరు లేరని యెరుకదోచిన జాలు ||
చ|| అతిచంచలంబై నయాతును గలిగించు- | కతమున బహుచిత్తగతులై |
యితరుల గొలిచైన యెదాయక యనాథ- | పతివేంకటపతి చేకొనుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం