సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వద్దే గొల్లెత
టైటిల్: వద్దే గొల్లెత
పల్లవి:
ప|| వద్దే గొల్లెత వదలకువే నీ- | ముద్దుమాటలకు మొక్కేమయ్యా ||
చరణం:చ|| యేలే యేలే యేలే గొల్లెత | నాలాగెరగవా నన్నునే చేవు |
చాలుజాలు నికజాలు నీరచనలు | పోలవు బొంకులు పోవయ్యా ||
చ|| కానీ కానీ కానిలే గొల్లెత | పోనీలే నీవెందు వోయినను |
మాని మాని పలుమారు జెనుకుచు మా- | తోనిటు సొలయక తొలవయ్యా ||
చ|| రావా రావా రావా గొల్లెత | శ్రీ వేంకటగిరి చెలువుడను |
నీవె నీవె నను నించితి కౌగిట | కైవశమైతిని గదవయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం