సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వద్దు నన్ను జెనకకుర
పల్లవి:

వద్దు నన్ను జెనకకుర వాదేటికి,
చద్ది వేడికి సొలపుజంకెనలు మేలు ||వద్దు||

చరణం:

వొలపి నొల్లముల పొందొనరించుకంటేను,
అలవోకలైన పొలయలుక మేలు,
కలసీ కలయని మనసు కనగాటుకంటేను,
తలపులో నడియాసతమకమే మేలు ||వద్దు||

చరణం:

పచి పెచ్హులకూర్మి పచరించు కంటేను,
కొచ్హి వూరకయుండు గుట్టు మేలు,
వచ్హియును రాములను వడి బొరలు కంటేను,
మచ్హరము మాని మెయి మఆచుతే మేలు ||వద్దు||

చరణం:

తనిపియును దనివొని రతులకంనాను,
కనుగొనుచు జెలగు సంగతులే మేలు,
యెనలేని శీ వేంకటేశ యిన్నిటికంటే,
నిను గలసియున్ననానేరుపే మేలు ||వద్దు||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం