సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెడమంత్ర మికనేల
పల్లవి:

ప|| వెడమంత్ర మికనేల వేరువెల్లంకులు నేల | పుడమిధరుడు మాకు భువనౌషధము ||

చరణం:

చ|| హరి యచ్యుతాయంటే నణగు బాపములు | నరసింహా యనియంటే నాటినదుఃఖములు మాను |
పురుషోత్తమాయంటే బుండ్లు బూచులు మాను | పరమౌషధ మీతడే పాటింప మాకు ||

చరణం:

చ|| వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా | వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను |
శ్రీసతీశ యనియంటే చింతలన్నియును మాను | గాసిదీర నితడే ఘనదివ్యౌషధము ||

చరణం:

చ|| గోవిందా యనియంటే గూడును సంపదలు | యీవల మాధవయంటే నిహము బరము జేరు |
దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు | శ్రీవేంకటేశుడే మాకు సిద్ధౌషధము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం