సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెదకిన నిదియే
పల్లవి:

ప|| వెదకిన నిదియే వేదార్థము | మొదలు తుదలు హరి మూలము ||

చరణం:

చ|| యెరవగు గుణములు యెన్ని కలిగిన | పరమ జ్ఞానము ప్రధానము |
యిరవుగ శ్రీ వేంకటేశ్వర నామము | సరవి మంత్రముల సారము ||

చరణం:

చ|| మునుకొని అవయవములు యెన్నైనా | పనిపడి శిరసే ప్రధానము |
యెనలేని సురలు యెందరు గలిగిన | మునుపటి హరియే మూలంబు ||

చరణం:

చ|| మోవని ఇంద్రియములు యెన్నైనా | భావపు మనసే ప్రధానము ||
యీవల మతములు యెన్ని కలిగినా | మూవురలో హరి మూలంబు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం