సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేదములే నీ
పల్లవి:

వేదములే నీ నివాసమట విమలనారసింహ
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ ||

చరణం:

ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన
నారాయణ రమాథినాయక నగధర నరసింహ
నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు
ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ ||

చరణం:

గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ
శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు
భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ ||

చరణం:

దాసపరికర సులభ తపన చంద్రనేత్ర
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం