సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేదం బెవ్వని
పల్లవి:

ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||

చరణం:

చ|| అలరిన చైతన్యాత్మకు డెవ్వడు | కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ | యిల నాతని భజియించుడీ ||

చరణం:

చ|| కడగి సకలరక్షకు డిందెవ్వడు | వడి నింతయు నెవ్వనిమయము |
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని | దడవిన ఘనుడాతని గనుడు ||

చరణం:

చ|| కదసి సకలలోకంబుల వారలు | యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం