సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేదన బొరలే
టైటిల్: వేదన బొరలే
పల్లవి:
ప|| వేదన బొరలే వెరవేలా | యీదయ విధి దనకీయదా ||
చరణం:చ|| తత్తరపాట్ల తనువికారముల | జిత్తము దెంచేచెలువేలా |
బత్తితో దాచిన పరధనంబుగొని | సత్తయు వుండుట చాలదా ||
చ|| యెక్కువతమకపుటింతుల బొందక | వక్కుచువాడే వయసేలా |
మొక్కుచు దాచిన మూలధనము గన- | నెక్కువ దైవంబియ్యదా ||
చ|| సేతల బొరలెడి చిక్కుల గెరలెడి- | రోతల యీనేరుపులేలా |
బాతిగ వేంకటపతిరతి జిత్తపు- | టూతల గోరిక లూనవా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం