సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేళగాదు సిగ్గులకు
పల్లవి:

ప|| వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని | గోలతనమిపుడేలే కొంగుపట్టీ నతడు ||

చరణం:

చ|| తమకించి నపుడే తతియాయ రతులకు | సుముఖుడైనపుడే సూటి మాటకు |
చెమరించినపుడే చేతలకెల్లా లోను | కొమరె వేల లోగేవే కొంగువట్టీ నతడు ||

చరణం:

చ|| అంట జూచినపుడే అదనట్టే నవ్వులకు | వెంట వచ్చినపుడే విందుమోవికి |
నంటు సేసుకున్నప్పుడే నయము కోరికలకు | దంటవు యేల కొంకేవే దక్కగొనీ నతడు ||

చరణం:

చ|| ఆయములంటినప్పుడే అనువు నీ పంతాలకు | చాయ సేసుకొన్నపుడే చవి కౌగిలి |
యీయెడ నలమేల్మంగ ఇదిగో శ్రీ వేంకటేశు- | నోయమ్మ కూడితివి నీ వొడి వట్టెనతడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం