సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేఱొకచోట లేడు వీడివో హరి
టైటిల్: వేఱొకచోట లేడు వీడివో హరి
పల్లవి:
వేఱొకచోట లేడు వీడివో హరి
వీఱిడియై చేరువనే వీడివో హరి.
మునుకొని వెదకితే ముక్కుమార్పుగాలికొన
వెనవెనక దిరిగీ వీడివో హరి
పెనగి వెదకబోతే పెడచెవులమంత్రమై
వినవచ్చీ మాటలలో వీడివో హరి.
సోదించి వెదకితేను చూపులకొనలనే
వీదుల నెందు చూచినా వీడివో హరి
ఆదిగొని వెదకితే నట్టే నాలికకొన
వేదమై నిలిచినాడు వీడివో హరి.
తెలిసి వెదకబోతే దేహపుటంతరాత్మయై
వెలుపలా లోపలాను వీడివో హరి
చెలగి శ్రీవేంకటాద్రి చేకొని మమ్ము రక్షించ
వెలసె నిందరు జూడ వీడివో హరి.
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం