సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేసరించేదానగాను
టైటిల్: వేసరించేదానగాను
పల్లవి:
ప|| వేసరించేదానగాను వేగినంతా నిన్నును | రాశికెక్క మీకృపనే రతి జెలగుదును ||
చరణం:చ|| నట్టనడుమనే నీవు నావాడవై వుంటేజాలు | అట్టే నే నెంతటి నైనా నౌదును |
గుట్టుతోడ నీవునాకు గొలువిచ్చితే జాలు | నెట్టన లోకమునకు నేనే రాజౌదును ||
చ|| కందువ నీవు నన్ను గన్నుల జూచితేజాలు | అందపు సిరుల నోలలాడుదును |
మందలించి నాతో నొక మాటలాడితే చాలు | పందెమాడి నీచే తుదిపదము చేకొందును ||
చ|| చేరి శ్రీవేంకటేశ్వర సెలవి నవ్వితే జాలు | కోరి నీవలపులకు గురి యౌదును |
సారె నలమేల్మంగను సతి నీకు నైతే జాలు | మేరతో గూడితిని మేలెల్లా సాదింతును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం