సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేసరితిమెట్ల
టైటిల్: వేసరితిమెట్ల
పల్లవి:
ప|| వేసరితిమెట్ల నీవెంట దిరిగి | గాసిబెట్టక మమ్ము గావరారా ||
చరణం:చ|| తీసితివి కోరికల తెగనీక పంచలకు | తోసితివి యింటింట దోయదోయ |
చేసితివి నీచేత చెల్లె నికనైనను | ఆస నీపొందొల్ల మంపరాదా ||
చ|| కట్టితివి కర్మముల కడదాక నాపదల | బెట్టితివి దుఃఖముల బెనచిపెనచి |
పట్టితివి చలము మము పాయనని యాస నీ- | విట్లైన గొంత సుఖమియ్యరాదా ||
చ|| కరపితివి పాపములే కడగి నానావిధుల | నెరపితివి దుర్దశలే నేర్పుమెరసి |
తెరగొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని- | నెరిగియును నెరగలేమింక నేతెరువో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం