సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేసరకు వీ డేల యనకుము విడువ నిన్నిక శరణు చొచ్చితి
పల్లవి:

వేసరకు వీ డేల యనకుము విడువ నిన్నిక శరణు చొచ్చితి
నీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికి జేట వేగా

చరణం:

మీరు నాకు గలరు నేనేమి సేసిన గాతురనియెడి
ధీరతను జము సరకు గొనకే తివిరి సేసితి బాపము॥
వోరసేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు
వారికివి గొరగాను॥ నేనెవ్వరిని నెఱగను మిమ్మేకాని॥

చరణం:

మిమ్ముగొలిచినగర్వమున నేమీ జేయక కాలమందే,
నమ్మి కర్మములెల్ల మానితి నాకునాకే వేసరి॥
దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచు బరాకుచేసిన
యిమ్ములను నన్నవియు రోసును యేల నా కవి నీవేకాక॥

చరణం:

నీకు మొక్కినమందెమేళము నేనొక కొండసేసుక
లోకములదేవతలకెల్లను లోను వెలిగా నైతి॥
యీకడను శ్రీవేంకటేశుడ యిప్పుడిటు ననుగరుణజూచితి
చేకొనుచు వారె మెత్తురు చెలగి నీకింకరుడననుచు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం