సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేవేలచందాల
పల్లవి:

ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు ||

చరణం:

చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి | అతిశయిల్లేటి పరమానందమితడు ||

చరణం:

చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||

చరణం:

చ|| వరముతో యశోద వసుదేవాదులకు | పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | నిరతి దాసుల పాలి నిధాన మితడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం