సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెలికీ వెళ్ళడు
టైటిల్: వెలికీ వెళ్ళడు
పల్లవి:
ప|| వెలికీ వెళ్ళడు చలికీ వెరవడు | వులికీ నులికీ నులికీనయ్యా ||
చరణం:చ|| రోగియై తా రుచుల బాయడు | భోగియై రతిపొందల్లడు |
వేగిమిగిలినవెడచీకటినీరు | తాగీ దాగీ దాగీనయ్యా ||
చ|| తొడికీ దొడకడు వుడికీ నుడకడు | కడికీ గసరడు కడుజేరడు |
మడికీ గుడికీ మానినమమతల | బుడికీ బుడికీ బుడికీనయ్యా ||
చ|| నిండీ నిండడు నెరసీ నెరయడు | పండీ బండడు బయలీతలా |
అండనె తిరువేంకటాధిపు దలపుచు- | నుండీ నుండీ నుండీనయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం