సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెలుపలెల్ల తనలోనుగాక
టైటిల్: వెలుపలెల్ల తనలోనుగాక
పల్లవి:
ప|| వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదు వెడమాయా |
నలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు ||
చ|| జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము |
వాపులెల్ల నొకవావిగాక మఱి వదలదు ప్రపంచము |
భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు |
దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు ||
చ|| మాటలెల్ల గడమాటలుగాక మాయదు మలినంబు |
కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము |
చాటుదృష్ణ లగచాటునబడక చాలదు సౌఖ్యంబు |
తేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు ||
చ|| గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు |
అనువున కనువై అంతయు దాగాక ఆనందము లేదు |
ప్రణుతింపగ శ్రీ వేంకటరమణుని బహుళమహిమెల్లా |
గణనకెక్కగా పురాతనులు మును కడకట్టినమతము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం