సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెలయునిన్నియును
పల్లవి:

ప|| వెలయునిన్నియును వృథావృథా | తలపున శ్రీహరి దడసినను ||

చరణం:

చ|| ఎడయనిపుణ్యము లెన్నియైనా | విడువక సేయుట వృథావృథా |
బడిబడి నే శ్రీపతి నాత్మలో | దడవక యితరము దడవినను ||

చరణం:

చ|| యెరపులతపముల నెంతైనా | విరవిర వీగుట వృథావృథా |
హరినచ్యుతు బరమాత్మునిని | మరిగి తలచక మరచినను ||

చరణం:

చ|| దైవము నెరగక తమకమున | వేవేలైన వృథావృథా |
శ్రీవేంకటగిరి చెలువునిని | సేవించక మతి జెదరినను ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం