సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెనక ముందరికి
పల్లవి:

ప|| వెనక ముందరికి బెద్దల కెల్లను వివరపు సమ్మతి యీ వెరవు |
వెనుకొని తన గురు నాథుని యనుమతి వేదోక్తంబగునీ తెరవు ||

చరణం:

చ|| కనకాసక్తుడు గాకుండుట మది కైవల్యమునకు నొక తెరువు |
వనితల భ్రమలకు వలల దగులని వైకుంఠమునకు నొక తెరువు |
మును కోపము బెడ బాసిన మతి మోక్షంబునకును నొక తెరువు |
యెనసి యిందుపై హరి దలచిన మతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు ||

చరణం:

చ|| నిరతి విషయముల నణచిన ధృఢ మతి నిశ్శ్రేయసమున కొక తెరువు |
విరతి తోడ నెలవైన మతి విభవపు బరమున కొక తెరువు |
వెరవున నిందరి మీదటి సమమతి విష్ణులోకమున కొక తెరువు |
యిరవెరి గంతట హరి నమ్మిన మతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు ||

చరణం:

చ|| జనక శీలుడ నేను జనకుడవు నీవు | ఘనవేదాంత నిధివి కర్మిని నేను |
అనిశము శ్రీ వేంకటా చలేంద్రుడవు నీవు | పనుల నీ సంకీర్తన పరుడ నేను ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం