సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెనకేదో ముందరేదో వెఱ్రి నేను నా
పల్లవి:

వెనకేదో ముందరేదో వెఱ్రి నేను నా
మనసుమరులు దేర మందేదొకో

చరణం:

చేర మీదటిజన్మముసిరులకు నోమేగాని
యేరూపై పుట్టుదునో యెఱగ నేను
కోరి నిద్రించ బరచుకొన నుద్యోగింతుగాని
సారె లేతునో లేవవో జాడ దెలియ నేను

చరణం:

తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేగాని
కల్లయేదో నిజమేదో కాన నేను
వల్ల చూచి కామినుల వలపించేగాని
మొల్లమై నామేను ముదిసిన దెరగ

చరణం:

పాపాలు చేసి మఱచి బ్రదుకుచున్నాడగాని
వైపుగజిత్రగుప్తుడువ్రాయు టెఱగ
యేపున శ్రీవేంకటేశు నెక్కడో వెతకేగాని
నాపాలిదైవమని నన్ను గాచుటెఱగ

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం