సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు
టైటిల్: వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు
పల్లవి:
వెన్నలుదొంగిలునాటివెఱ్రివా నీవు
విన్నకన్న జాడ గాదు వెఱ్రివా నీవు
చేరి నిన్ను నొల్లనట్టిజీవుల నీవు దరాన
వీరుడవై మోచేవు వెఱ్రివా నీవు
నారపేరు నుడిగితే నాపేరంటా దగిలేవు
వీరాన జుట్టమవై వెఱ్రివా నీవు
బంటులైనవారికి బరతంత్రుడవై యీ
వెంట వెంట దిరిగేవు వెఱ్రివా నీవు
అంటే ననరాదు రెండు అడుకులకే చొచ్చేవు
వింటే మాకు నవ్వు వచ్చీ వెఱ్రివా నీవు?
పావనులయి లోకమెల్లా బదుకుమంటా బేళ్ళు
వేవేలు వెట్టుకొంటివి వెఱ్రివా నీవు
శ్రీవేంకటేశుడవై చెంది వరము లిచ్చేవు
వేవేగ నెవ్వరికైనా వెఱ్రివా నీవు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం