సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెన్నవట్టుక నేయి
టైటిల్: వెన్నవట్టుక నేయి
పల్లవి:
ప|| వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- | నెన్నివలసినను దమయేలేటివి కావా ||
చరణం:చ|| తలపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు | కలుగుటే కలుగవలెగాక |
వలపైనభోగములు వైభవంబులు మరియు | కలవెల్ల తమయెదుట గలిగినవె కావా ||
చ|| పదిలముగ హరినామపఠన మంత్రము నోరు | కదియుటే కలుగవలెగాక |
తుదిలేనిసంపదలు తొలగనిముదంబులును | కదలకెప్పుడు దమకు గలిగినవె కావా ||
చ|| యించుకైనను వేంకటేశుగిరిశిఖరంబు | కాంచుటే కలుగవలెగాక |
అచింతంబైన నిత్యానందపదవులును | మించి తమయెదుట బ్రభవించినవె కావా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం