సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెరపులు నొరపులు
టైటిల్: వెరపులు నొరపులు
పల్లవి:
ప|| వెరపులు నొరపులు వృథా వృథా | ధరపై మరి యంతయును వృథా ||
చరణం:చ|| తడయక చేసినదానంబులు వృథ | యెడనెడ నెరిగినయెరుక వృథా |
వొడలిలోనిహరి నొనరగ మతిలో | దడవనిజీవమె తనకు వృథా ||
చ|| జగమున బడసినసంతానము వృథ | తగిలి గడించినధనము వృథా |
జగదేకవిభుని సకలాత్ముని హరి | దెగి కొలువనిబుద్ధియును వృథా ||
చ|| పనివడికూడిన పరిణామము వృథ | వొనరగనుండినవునికి వృథా |
ఘనుడగు తిరువేంకటగిరిహరి గని | మననేరని జన్మములు వృథా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం