సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెర్రివాడు వెర్రిగాడు
పల్లవి:

ప|| వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక | విర్రవీగేయహంకారి వెర్రివాడు ||

చరణం:

చ|| నాలుకపై శ్రీహరినామమిట్టే వుండుగాను | జోలితో మరచిననీచుడే వెర్రివాడు |
అలరియీజగమెల్లా హరిరూపై వుండగాను | వాలి తలపోయనివాడు వెర్రివాడు ||

చరణం:

చ|| కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే | కోరివేరె కలడనేకుమతి వెర్రివాడు |
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను | దూరమై తిరుగువాడే దొడ్డ వెర్రివాడు ||

చరణం:

చ|| సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండగా | సారె గర్మములంటేడి జడుడు వెర్రివాడు |
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా | మోరతోపైవున్నవాడే ముందు వెర్రివాడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం