సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెఱ్రి మానుప రెవ్వరు వేదురు నాయంత విడువదు
పల్లవి:

వెఱ్రి మానుప రెవ్వరు వేదురు నాయంత విడువదు
ముఱ్రబాలలోబుట్టిన ముంచిన వెఱ్రెయ్యా.

చరణం:

జగములు రxఇంచ బాల్పడి సర్వేశ్వరుడే వుండగ
అగణితు డాతనిశక్తి యల్పముగా దెలసి
జిగి నాసంసారరxఅణ సేసెదినంచును దిరిగెద
నగుబాత్ల యల్పుడ నే నావెఱ్రిదేయయ్యా.

చరణం:

అంతర్యామై దేవుడు అటు సుఖదుఃఖము లొసగగ
అంతయు మనుజులు సేసేరని నే దిరిగితిని
బంతినే నావంటి జీవులబడి దిరిగాడుచు గర్మపు
దొంతుల జిక్కిననా వెఱ్ఱితోడనే యిదేయయ్యా.

చరణం:

శ్రీవేంకటపతి యెదుటనే చేకొని వరము లొసగగ
దావతిపడి యితరుల నే దగులుచు నడిగితిని
యీవేళనే నాగురుడును యీదైవము నిటు చూపగ
తో వెరిగిటు నే బతికితి తొల్లెల్ల వెఱ్ఱినయ్యా.

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం