సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెఱ్రిదెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు
టైటిల్: వెఱ్రిదెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు
పల్లవి:
వెఱ్రిదెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు
యిఱ్రిదీముభోగముల నెనసేము
మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక
పొరి బరిమళములు పూసేము
పరగ పునుకతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము.
పుక్కట పంచేంద్రియపువుట్టు వుట్టి యందరిలో
మొక్కించుక దొరలమై మురిసేము
అక్కర నజ్ఞానమనేఅంధకారముననుండి
దిక్కుల నెదిరివారి దెలిపేము.
దినసంసారమే మాకు దేవుడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేని శ్రీ వేంకటేశ మమ్ము గావగాను
తనిసి తొల్లిటిపాటు దలచేము.
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం