సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెఱవకు మనసా
టైటిల్: వెఱవకు మనసా
పల్లవి:
ప|| వెఱవకు మనసా విష్ణుని యభయము | నెఱవుగ నెదుటనే నిలచినది ||
చరణం:చ|| శ్రీపతి కరుణ జీవ రాసులకు | దాపును దండై దగిలినది |
పై పై దేవుని బలు సంకల్పమె | చెపట్టి రక్షింప చెలగేది ||
చ|| నలినోదరు నిజ నామాంకితమే | యిలపై దాసుల నేలేది |
కలి భంజను శంఖ చక్ర లాంఛన- | మలవడి శుభముల నందించేది ||
చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలె | వేవేల విధుల వెలసేది |
భూవిభుడితడు పూచిన మహిమలె | కైవసమై మము గాచేది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం