సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెరవకు మనసా
టైటిల్: వెరవకు మనసా
పల్లవి:
ప|| వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||
చరణం:చ|| శ్రీపతి కరుణ జీవరాసులకు | దాపును దండై తగిలినది |
పైపై దేవుని బలు సంకల్పమె | చేపట్టి రక్షించ చెలగేది ||
చ|| నలినోదరు నిజ నామాంకితమే | ఇలపై దాసుల నేలేది |
కలిభంజను శంఖ చక్ర లాంఛన | మలవడి శుభముల నందించేది ||
చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలే | వేవేల చందాల వెలసినది |
భూవిభుడితడు పూనిన మహిమలె | కైవసమై మము గాచేది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం