సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెట్టి వలపు
పల్లవి:

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో
వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి ||

చరణం:

వినయము సేసేవు విష్ణుమూరితి
వెనకటి వాడవెగ విష్ణుమూరితి
వినవయ్యా మామాట విష్ణుమూరితి మమ్ము
వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి ||

చరణం:

వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు
వెరగైతి నిన్ను జూచి విష్ణుమూరితి
విరివాయె నీమాయలు విష్ణుమూరితి నాకు
విరులిచ్చే వప్పటికి విష్ణుమూరితి ||

చరణం:

వెలసె నీ సేతలెల్ల విష్ణుమూరితి మా-
వెలుపలలోన నీవె విష్ణుమూరితి
వెలలేని శ్రీవేంకట విష్ణుమూరితి కూడి
విలసిల్లితివి నాతో విష్ణుమూరితి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం