సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వెట్టిమోపువంటిమేను
టైటిల్: వెట్టిమోపువంటిమేను
పల్లవి:
ప|| వెట్టిమోపువంటిమేను విడనాడి వీ- | డిట్టె దాటిపోయె నెటువంటిజాణే ||
చరణం:చ|| ఘోరమైన ఆసలనెడికూకటవేరు దవ్వి- | పారవేసి యిడుమల బడనొల్లక |
యీరసపుసంసార మింగలము దగిలించి | యేరు దాటిపోయె నెటువంటిజాణే ||
చ|| కన్నవారి దన్ను బ్రేమ నన్నవారి దిగనాడి | వున్నతమైనచోట నుండబోయి |
తన్నుదా వేంకటపతి దాసులజేరి వాడు | యెన్నడు దిరిగిరాడే యెటువంటిజాణే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం