సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విభుడ వింతటికి వెరపుతో ననుగావు
పల్లవి:

విభుడ వింతటికి వెరపుతో ననుగావు
అభయహస్తముతోడిఆదిమూలమా

చరణం:

పలులంపటాలచేత బాతువడి పాటువడి
అలసితి గావవే వో ఆదిమూలమా
చలమరి యితరసంసారభ్రాంతి జిక్కితి న -
న్నలరించి కావవే వోఆదిమూలమా

చరణం:

యెంతకైనా నాసలచే యేగేగి వేసరితి
నంత కోప గావవే వో ఆదిమూలమా
సంతలచుట్టరికాల జడిసితి నిక గావు
అంతరాత్మ నాపాలిఆదిమూలమా

చరణం:

రంటదెప్పుటింద్రియాల రవ్వైతి గావవే వో-
అంటినశ్రీవేంకటాద్రిఆదిమూలమా
గెంటక ముమ్మాటికిని నీకే శర-
ణంటి గావవే వో ఆదిమూలమా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం