సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విచారించు హరి నావిన్నప మవధరించు
పల్లవి:

విచారించు హరి నావిన్నప మవధరించు
పచారమే నాదిగాని పనులెల్లా నీవే ॥ పల్లవి ॥

చరణం:

తనువు నాదెందుగాని ~తనువులోనింద్రియములు
అవిశము నా చెప్పినట్టు సేయవు
మనసు నాదెందుగాని మర్మము నాయిచ రాదు
పనిపడి దూరు నాది పరులదే భోగము ॥విచా॥

చరణం:

అలరి నానిద్దర నాదెందగాని, సుఖమెల్ల
కలలోని కాపిరాలకతలపాలె
తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము
యెలమి బేరు నాది యెవ్వరిదో బలువు ॥విచా॥

చరణం:

కర్మము నాదెందు గాని కర్మములోపలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆదీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీ దింతే నేరుపు నీమాయది ॥విచా॥

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం