సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విచ్చేయరాదా వెలది
టైటిల్: విచ్చేయరాదా వెలది
పల్లవి:
ప|| విచ్చేయరాదా వెలది కడకు నీవు | యిచ్చ నాసపడు వారి నెలయించదగునా ||
చరణం:చ|| నిలిచి నిలిచి నీకు నిక్కి యెదురు చూచీని | వలచిన సతి నీవు వచ్చేవంటా |
మలసి మలసి నీ మాటలే ఆలకించీని | యెలమి నేమని యానతిత్తువో యనుచు ||
చ|| చిమ్మి చిమ్మి నీ యింటికి చేతులే చాచీని | తెమ్మల ఆసన్న నీవు తెలుతు వంటా |
కుమ్మరించి గుట్టుమాని నవ్వీని | పమ్మినీవు తన కొంగు పట్టుదువో యనుచు ||
చ|| పూచి పూచి నీ వద్దికి పొలతుల నంపీని | యేచక నీ విప్పుడిట్టె యేలుదు వంటా |
రేచి రేచి వలపుల రేసువాయ గూడితివి | దాచెను శ్రీ వేంకటేశ తమక మేలనుచు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం