సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విచ్చేయవమ్మా
పల్లవి:

ప|| విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా | మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక ||

చరణం:

చ|| పంచల పసిండి నిగ్గు పచ్చిదేరె సిగ్గు | వంచన వలపు తీపు వాలుక చూపు |
కంచపుం బాలకూడు కాకల నీవాడు | మంచపు నీ తలబ్రాలు మట్టెల పాదాలు ||

చరణం:

చ|| కోవిల కొసరుబాట కొమ్మరో నీమాట | తావుల చెంగావి నీ తళుకు మోవి |
గోవ జవ్వాది కరంగు గుబ్బల నీ మెరంగు | భవజుదాడి రొదలు పొఅద్పు నీ కదలు ||

చరణం:

చ|| ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగవు | అద్దలింపు గసరు మోహంపు గొసరు |
గద్దరి నీ యలపు వెంకటపతి తలపు | అద్దపు నీ మోము మోహన రతిసాము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం