సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విచ్చన విడినె
టైటిల్: విచ్చన విడినె
పల్లవి:
ప|| విచ్చన విడినె యాడే వీడె కృష్ణుడు | వొచ్చము లేనివాడు వుద్దగిరి కృష్ణుడు ||
చరణం:చ|| గల్లు గల్లు మనగాను గజ్జెలు నందెల తోడ | బిల్లగోట్లాడీని పిన్న కృష్ణుడు |
పెల్లురేగి వీధులను గేరి పుట్ట చెండులాడీ | బల్లిదుడు గదవమ్మ బాలకృష్ణుడు ||
చ|| తమితోడ గోపాలులు తాను గూడి ముంగిటను | సముద్ర బిల్ల లాడీ సాధు కృష్ణుడు |
చెమటలుగార సిరిసింగన వత్తియాడీ | గుమితాన వీడేయమ్మా గోపాలకృష్ణుడు ||
చ|| వుదుటున బారి సారి వుడ్డ గచ్చకాయలాడీ | ముదము దొలకగాను ముద్దు కృష్ణుడు |
అదివో శ్రీ వేంకటేశుడాట లెల్లా దానెయాడీ | పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం