సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విడుమనవో రోలు
పల్లవి:

ప|| విడుమనవో రోలు విడుమనవో వేగ | విడుమనవో తల్లి వెరచీ, నీబాలుడు ||

చరణం:

చ|| యెన్నడు గొల్లెతలయిండ్లు వేమారు జొచ్చి | వెన్నలు బాలును వెరజడు |
వన్నెలనీకోప మింత వద్దు నీకు నీయాన | కన్నులనవ్వుల ముద్దుగారీ నీబాలుడు ||

చరణం:

చ|| సారెకు పెరుగులచాడెలూ నేడుమొదలూ | గోరయై కోలల బగులమొత్తడు |
కూరిమిలేక నీవు కోపగించగా గన్నీరు | జోరునా రాలగా నిన్నే చూచీ నీబాలుడు ||

చరణం:

చ|| చాలు నీకోప మిది సరిలేని ముద్దులివి | రొలనేవీట్లను విరుగద్రోయడు |
మేలిమివేంకటపతి మేటి నీకొమారుడిదె | కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం