సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విడువరా దెంతైనా వెఱ్రివాడైన నీకు
టైటిల్: విడువరా దెంతైనా వెఱ్రివాడైన నీకు
పల్లవి:
విడువరా దెంతైనా వెఱ్రివాడైన నీకు
కడవారు నవ్వకుండా గాచుకో నన్నును
జ్ఞానము నే నెఱగ సజ్ఞానము నే నెఱగను
మానను విషయములు మంగెంతైనా
నీనామము నొడిగి నీదాసుడ ననుకొందు
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును
అకర్మము నెఱగను సుకర్మము నెఱగను
ప్రకటసంసారముపై పాటు మానసు
వొకపనివాడనై పూని ముద్రధారినైతి
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును
వెనక గానను ముందు విచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుడ శ్రీవేంకటేశ కన్నులెదుట బడితి
కవి పోవిడువరాదు కరుణించు నన్నును
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం