సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విడువవిడువనింక
టైటిల్: విడువవిడువనింక
పల్లవి:
విడువవిడువనింక విష్ణుడ నీపాదములు
కడగి సంసారవార్థి కడుముంచుకొనిన
పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను
ధరణిపై చెలరేగి తనువు వేసరినాను
దురితాలు నలువంక( దొడికి తీసినను
పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు
యీదేహమే యయిన ఇక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేగినా
శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమే చొచ్చితి నేనికను
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం