సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విధినిషేధములకు
టైటిల్: విధినిషేధములకు
పల్లవి:
ప|| విధినిషేధములకు వెరువగబనిలేదు | మధుసూదన నిమన్నన దాసుడైతే ||
చరణం:చ|| విడువరాని ధర్మవిధుల పురుషులను | విడిచి గోపికలు విచ్చనవిడి |
బడినిన్ను దగులుటే పరమధర్మమాయ | యెడయునితరధర్మా లికనేటికయ్యా ||
చ|| మానరానికర్మమార్గములటు మాని | పూనినయతులే పూజ్యులట |
నీనారాయణనియతే ధర్మమాయ | యీనిజ మొకటియు నెరుగగవలయు ||
చ|| యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుడై- | వున్న విచారాల నొదుగనేలా |
నిన్నుగూర్చినట్టి నిజభక్తి గలదని | తిన్ననై తెలిపేటితెలివే కలది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం