సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వీడె వీడె కూచున్నాడు
టైటిల్: వీడె వీడె కూచున్నాడు
పల్లవి:
ప|| వీడె వీడె కూచున్నాడు వేడుకతో గద్దెమీద | వాడి ప్రతాపముతోడి వరదాన సింహము ||
చరణం:చ|| అరయ ప్రహ్లాదుని ఆపదోద్ధార సింహము | గిరిపై ఇందిరకును క్రీడా సింహము |
నిరతి సురల భయనివారణ సింహము | సరి హిరణ్యకశిపుసంహార సింహము ||
చ|| ఇట్టె విశ్వమునకు ఏలికైన సింహము | గట్టిగ శరణాగతుల గాచే సింహము |
దిట్టమై వేదాలలోని తెరవేట సింహము | నెట్టుకొనిన దురితనివారణ సింహము ||
చ|| అంచెల మూడు మూర్తుల కాధారమైన సింహము | పంచల మునుల భాగ్యఫల సింహము |
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము | చెంచుల అహోబలపు శ్రీనారసింహము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం