సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వీడివో యిదె
టైటిల్: వీడివో యిదె
పల్లవి:
ప|| వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
చరణం:చ|| వెలయ నీట జోప్పువేసేటి దొంగ | తలగాననీక దాగుదొంగ |
తలకక నేలదవ్వేటిదొంగ | తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||
చ|| అడుగుకింద లోకమడచేటి దొంగ | అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ | తొడరి నీలికాసెతో నుండుదొంగ ||
చ|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ | రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద | మూసినముత్యమై ముదమందుదొంగ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం