సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వీధుల వీధుల విభుడేగేనిద
పల్లవి:

వీధుల వీధుల విభుడేగేనిదె
మోదము తోడుత మొక్కరో జనులు

చరణం:

గరుడ ధ్వజంబదె కనకరధంబదె
అరదముపై హరి అలవాడే
ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు
పరగ పగ్గములు పట్టరో జనులు

చరణం:

ఆడేరదివో అచ్చరలెల్లరు
పాడేరు గంధర్వ పతులెల్ల
వేడుకతో వీడే విష్వక్సేనుడు
కూడి ఇందరును కొలువరో జనులు

చరణం:

శ్రీ వేంకటపతి శిఖరముచాయదె
భావింప బహువైభములవె
గోవింద నామపు ఘోషణలిడుచును
దైవంబితడని తలచరో జనులు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం