సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వీనిజూచియైన
పల్లవి:

ప|| వీనిజూచియైన నేము విరతిబొందగలేము | పూని మాబ్రదు కిందుబోలదాయగా ||

చరణం:

చ|| పరుల వేడగబోవు పరనిందకు జొరవు | పరమపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల |
నరులమై ఘనులమై నానాబుద్ధులెరిగి | పొరి మాబ్రదుకు లిందుబోలదాయగా ||

చరణం:

చ|| కామక్రోధాదులు లేవు కామతత్త్వ మెఅగవు | కామించినట్లవు నెక్కడనైనా శిలలివి |
దీమసము గలిగియు దెలివి గలిగియును | భూమిలో మాబ్రదుకు కిందుబోలదాయగా ||

చరణం:

చ|| వొకరి గొలువబోవొ వొకపంట సేయబోవు | వొకమానిగూడు చేరివుండు పక్షులాడనాడ |
వొకశ్రీవేంకటపతి నమ్మియుండలేము | మొకమో మాబ్రదు కిందుబోలదాయగా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం