సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వీణ వాయించనే
పల్లవి:

వీణ వాయించనే అలమేలుమంగమ్మ
వేణుగాన విలోలుడైన వేంకటేశునోద్ద ||

చరణం:

కురులు మెల్లన జారగా
సన్నజాజివిరులూ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగా ||

చరణం:

సందటి దండలు కదలగాను
ఆణిముత్యాల సరులు వుయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరిగే ఘుమఘుమమనగా ||

చరణం:

చరణం:

ఘనన యనములూ మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేని జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనులవిందుగా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం