సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విజాతులన్నియు వృథా
పల్లవి:

ప|| విజాతులన్నియు వృథా వృథా | అజామిళాదుల కది యేజాతి ||

చరణం:

చ|| జాతిభేదములు శరీర గుణములు | జాతి శరీరము సరి తోడనే చెడు |
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషంబనాది |
ఈతల హరి విజ్ఞానపు దాస్యం యిదియొక్కటెపో ||

చరణం:

చ|| హరియిందరిలో నంతరాత్ముడిదె |
ధరణి జాతి భేదము లెంచిన |
పరమయోగులీ భావ మష్ట మదము భవ వికారమని మానిరి |
ధరణిలోన పరతత్త్వ జ్ఞానము ధర్మమూలమే సుజాతి ||

చరణం:

చ|| లౌకిక వైదిక లంపటులకు నివి |
కైకొను నవశ్య కర్తవ్యంబులు |
శ్రీ కాంతుడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదన మిందరికి |
మేకొని ఇన్నియు మీరిన వారికి మీనామమే సుజాతి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం