సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: విన్నవించితిమి
పల్లవి:

విన్నవించితిమి నీకు వేడుకవేళ
కన్నెను నీవు దయ గాచేటివేళ ||

చరణం:

మచ్చికలు దయివారె మనసెల్ల జైవారె
వచ్చె జవ్వనానకు వసంతవేళ
చొచ్చి నిన్నుబాసి తాపసూర్యుడెండగాయగా
విచ్చన విడిగా దోచె వేసగి వేళ ||

చరణం:

సిగ్గులు మొలవజొచ్చె చెమటలేరులు హెచ్చె
కగ్గు లేకమించె భానకాలపు వేళ
వెగ్గళించి సెలవు వెన్నెలలు చూపట్టె
వొగ్గి శరత్కాలము వొదిగె నీవేళ ||

చరణం:

తత్తరపు చలి పొందె తలపోతమంచు మించె
యెత్తి యలమేల్మంగకు హేమంత వేళ
బత్తితో శ్రీవేంకటేశ పైకొని కూడితి విట్టె
చిత్తజు కాకలు దేరె సిసిర వేళ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం